Monday, April 20, 2026
HomeTelanganaNizamabadక్రమశిక్షణతోనే రాజకీయ ఎదుగుదల భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

క్రమశిక్షణతోనే రాజకీయ ఎదుగుదల భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

డిచ్‌పల్లిలో ఉత్సాహంగా శిక్షణ తరగతులు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, పార్టీలో నిర్వహించే శిక్షణ తరగతులు కార్యకర్తలు, నాయకులు రాజకీయంగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు.

ఆదివారం మండల కేంద్రంలోని ఎస్పీఆర్ డిగ్రీ కళాశాలలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయి శిక్షణ తరగతులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ తరగతులు దిక్సూచిలా పనిచేస్తాయన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకుని, అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, శిక్షణ తరగతుల ఇన్ ఛార్జ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంగర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ప్రమోద్, నక్క రాజేశ్వర్, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రకాంత్, వీరితో పాటు రూరల్ పరిధిలోని ఏడు మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!