HomeTelanganaNizamabadపోచమ్మగల్లిలో మాల సంఘం ఎన్నికలు విజయవంతం.. కొత్త కమిటీ ఎన్నిక

పోచమ్మగల్లిలో మాల సంఘం ఎన్నికలు విజయవంతం.. కొత్త కమిటీ ఎన్నిక


నగరంలోని పోచమ్మగల్లి మాల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. సంఘం సభ్యులందరూ పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తార్ల రాజేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.అలాగే ఉపాధ్యక్షుడుగా నంది హరీన్, ప్రధాన కార్యదర్శి: తార్ల రమేష్, కోశాధికారి: ఎడ్ల పవన్, అసోసియేషన్ అధ్యక్షుడు: ఎడ్ల దనంజయ్ లను ఎన్నుకున్నారు.

ఎన్నికైన అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. మాల సంఘం అభ్యున్నతికి, సభ్యుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ప్రకటించారు.

అందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘం గౌరవాన్ని పెంపొందిస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సంఘ సభ్యులు, కాలనీవాసులు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments