HomeCRIMEనగర శివారులో చైన్ స్నాచింగ్ కలకలం..మాణిక్ భండార్ ఎక్స్ రోడ్డు వద్ద ఘటన

నగర శివారులో చైన్ స్నాచింగ్ కలకలం..మాణిక్ భండార్ ఎక్స్ రోడ్డు వద్ద ఘటన

నగర శివారులోని మాణిక్ భండార్ ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై వేచి ఉన్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు.స్థానికుల సమాచారం మేరకు..

బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి మాణిక్ భండార్ ఎక్స్ రోడ్డు వద్ద నిలబడి ఉండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మెరుపు వేగంతో ఆమె మెడలోని గొలుసును తెంపుకుని పారిపోయారు. బాధితురాలు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.

అయితే దుండగులు అపహరించిన గొలుసు రోల్డ్ గోల్డ్ అని, అందులో ఉన్న రెండు పుస్తెలు మాత్రం బంగారానివని స్థానికులు చర్చించుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments