ట్రాఫిక్ కానిస్టేబుల్ భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలుసుకున్న ట్రాన్స్కో ఉద్యోగి సతీష్ కూడా తన వంతుగా మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆదివారం ఉదయం ఆమెకు రక్తం అవసరమని తెలియగానే, ఆయన వెంటనే ఆసుపత్రికి చేరుకొని రక్తదానం చేశారు. ఒకే సమయంలో అటు పోలీస్ అధికారి, ఇటు ట్రాన్స్కో సిబ్బంది కలిసికట్టుగా స్పందించి ప్రాణదాతలుగా నిలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఆపదలో ఉన్న వారికి కులమతాలకు, శాఖలకు అతీతంగా సాయం చేసిన సతీష్ గారిని పలువురు అభినందించారు.
