HomeCRIMEకామారెడ్డి జిల్లాలో దారుణం బంగారు ఆభరణాల కోసం అత్తను హత్య చేసిన కోడలు

కామారెడ్డి జిల్లాలో దారుణం బంగారు ఆభరణాల కోసం అత్తను హత్య చేసిన కోడలు

కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, సీతాయిపల్లి గ్రామం:


సమాజాన్ని కలచివేసే ఘోర సంఘటన చోటుచేసుకుంది. బంగారు ఆభరణాల కోసం ఒక కోడలు తన అత్తను హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.
గ్రామానికి చెందిన రుక్మవ్వ అనే వృద్ధ మహిళను ఆమె కోడలు కోటవ్వ హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో కోడలు కోటవ్వ, అత్త వద్ద ఉన్న బంగారు ఆభరణాల కోసం ముందుగా పథకం వేసి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.


హత్య అనంతరం, ఆ ఘటనను సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేసింది. అయితే మృతురాలి తలపై గాయాలు ఉండటంతో గ్రామస్థులకు అనుమానం కలిగింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.


సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కోడలు కోటవ్వనే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఆమె వద్ద నుండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమెను రిమాండ్‌కు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments