Monday, April 20, 2026
HomeTelanganaNizamabadహిందువుల్లో ఐక్యత పెరుగుతుంది..భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీక హనుమంతుడు…అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా..

హిందువుల్లో ఐక్యత పెరుగుతుంది..భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీక హనుమంతుడు…అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా..

ఇందూరు: హిందువుల్లో ఐక్యత పెరుగుతుందని, మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ గురువారం నిర్వహించిన వీర హనుమాన్ విజయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.

భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీకైన ఆంజనేయస్వామి మనందరికీ స్ఫూర్తి అన్నారు. ఆయన జీవితం గొప్ప పాఠం చెబుతుందని, సంకల్పం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదన్నారు.

శ్రీరాముడు సేవలో హనుమంతుడు చూపిన అంకితభావం, నిజాయితీ, ధైర్యం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమన్నారు. ఇవే విలువలు మన సమాజానికి అత్యంత అవసరమని తెలిపారు.
హనుమంతుడి శక్తి అంటే కేవలం శారీరక బలం కాదని, మనోబలం, విశ్వాసం, సేవా భావమని కొనియాడారు.

ఇది ఒక పండుగ మాత్రమే కాదని, మనలోని శక్తిని మేల్కొలిపే రోజన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి రవికుమార్, విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ రాకూర్, ప్రధాన కార్యదర్శి దయానంద్, దుర్గా వాహిని ప్రముఖ్ సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!