ఈరోజు రూరల్ నియోజకవర్గం లో పోలీస్ లు ఎన్నివిధాలా అడ్డుకోవాలని చుసిన వారికి చిక్కకుండా బైక్ పైన పెద్దమ్మ గుడి వద్దకు చేరుకున్నారు వాడి పెద్దమ్మ గుడి దగ్గర బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారు మాట్లాడుతూ రూరల్ mla భూపతి రెడ్డి పై ద్వజమెత్తారు! “మాట ఇస్తే నిలబెట్టుకోవడం మా సంస్కారం…మాట తప్పడం మీ అలవాటు అని దినేష్ పటేల్ కులాచారి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న సవాలు విసిరినట్లుగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ఉదయం పెద్దమ్మ గుడి వద్దకు వచ్చాను… కానీ భూపతి రెడ్డి మాత్రం ప్రజల ముందుకు రావడానికి భయపడ్డాడు!రైతులకు నష్టపరిహారం ఇచ్చామని గొప్పలు చెప్పడం సులువు…కానీ ఆధారాలు చూపడం ఎందుకు కష్టం? ఎంతమందికి ఇచ్చావ్? ఏ గ్రామాలకు ఇచ్చావ్?ఎవరికి ఒక్క రూపాయి అయినా చేరిందా?అని నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు.
సత్యం చెప్పే ధైర్యం లేక… రాత్రి చీకటిలో మా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయించడం…ఇది నీ బలహీనతకు నిదర్శనం!ప్రశ్నిస్తే కేసులు… ఎదిరిస్తే అరెస్టులు…ఇదేనా నీ పాలన? ఇదేనా ప్రజాస్వామ్యం? రైతన్నల కష్టాలను రాజకీయ లాభాల కోసం వాడుకోవడం ఆపు! అబద్ధాలతో ఎంతకాలం ప్రజలను మోసం చేస్తావ్?నేను ఇక్కడికి వచ్చాను…
నువ్వెక్కడ ఉన్నావ్?ప్రజల ముందు నిలబడే ధైర్యం ఉందా? రైతుల డబ్బు ఎక్కడికి పోయిందో లెక్క చెప్పే వరకు…బీజేపీ పోరాటం ఆగదు! రైతన్నకు న్యాయం జరిగే వరకు యుద్ధం కొనసాగుతుంది!అబద్ధాల పాలనకు ముగింపు దగ్గరలోనే ఉంది! అక్కడ కొద్దిసేపు ఉద్రికత వాతావరణం కొనసాగింది దినేష్ పటేల్ కులాచారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పెద్ద కార్యకర్తలు నినాదాలు చేశారూ
