ఇంటర్ విద్య అధికారి2025 _ 26 విద్యా సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో సప్లిమెంటరీ పరీక్ష ఫీజును చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు.
అలాగే రీకౌంటింగ్ చేయించుకోదల్చుకున్న విద్యార్థులు 100 రూపాయల రుసుము, రీవాల్యుయేషన్ స్కాన్ కాపీ పొందడానికి 800 రూపాయలను మీసేవ ద్వారా ఈనెల 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ కుమార్ తెలియజేశారు.
కాగా ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించేవారు సప్లమెంటరీ పరీక్ష ఫీజు కూడా చెల్లించుకోవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మే 13 వ తేది నుండి సప్లిమెంటరీ పరీక్షలు …సప్లిమెంటరీ పరీక్ష ఫీజును చెల్లించిన విద్యార్థులకు మే 13వ తేదీనుండి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం రెండవ సంవత్సరం విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ తిరుమలపూడి రవికుమార్ తెలియజేశారు.
సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు.
