ఈ కార్యక్రమాన్ని నగర BRS పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చి గణేష్ బిగాల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
గణేష్ బిగాల గారి జన్మదినం సందర్భంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట కమాన్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి, ప్రయాణికులకు మరియు స్థానిక ప్రజలకు చల్లని తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలాగే కోటగల్లి లో చింతకాయల రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాయకులు, డివిజన్ ఇంచార్జులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గణేష్ బిగాల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,మాజీ Nuda చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్ ఠాకూర్,నవీద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
