ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో తమ పాఠశాల సత్తాను చాటారు.
పాఠశాల ఏజిఎం అఫీజ్, కో-ఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి: ప్రణవి:588/600, అభిరామ్:585/600, శ్రీలస్య:581/600, రిషిత: 580/600, వరుణ్:579/600, సాత్విక:** 577/600 లు వచ్చాయని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన బోధన, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయి.
మహిపాల్ రెడ్డి, కో-ఆర్డినేటర్ తెలిపారు.విజయం సాధించిన విద్యార్థులను శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ గురుచరణ్, స్వప్నతో పాటు డీన్లు, ఇంచార్జులు, ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొని విద్యార్థులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
