పదో తరగతి ఫలితాల్లో ఘనవిజయం సాధించిన నగరంలోని విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులను టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా అభినందించారు. గురువారం నాడు ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారి ప్రతిభను కొనియాడారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు పదో తరగతిని పునాదిగా చేసుకుని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
విద్యార్థుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందాన్ని, ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్రమశిక్షణ, నిరంతర కృషి ఉంటే విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించగలరు. విజ్ఞాన్ విద్యార్థులు సాధించిన ఫలితాలు స్ఫూర్తిదాయకం అన్నారు.
ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ పాఠశాల డైరెక్టర్ జయసింహా గౌడ్, ప్రిన్సిపాల్ మంజు ప్రదీప్ పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం మహేష్ కుమార్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.
విద్యార్థులు తమకు వచ్చిన మార్కులను ఎమ్మెల్సీకి వివరించి, ఆయన చేతుల మీదుగా అభినందనలు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
