HomeCRIMEతాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ..గంగారం తండాలో దొంగతనం కేసు ఛేదింపు:ముగ్గురు అరెస్ట్

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ..గంగారం తండాలో దొంగతనం కేసు ఛేదింపు:ముగ్గురు అరెస్ట్

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను ఇందల్వాయి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు బైక్, నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ నగరంలోని సుభాష్‌నగర్ పరిధిలో నివాసం ఉండే బొమ్మెర్ల సోమేష్, పాటోల్ శైలేష్‌లు వృత్తిరీత్యా కూలీ పనులు చేసేవారని తెలిపారు. అయితే సోమేష్‌కు గతంలోనే నేర చరిత్ర ఉంది. పలు దొంగతనాల కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.

వీరు గత నెల 21వ తేదీ అర్ధరాత్రి ఇందల్వాయి మండలం గంగారం తండాలో నసీం సుల్తానా అనే మహిళ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. ఇదే అదనుగా ఇంట్లోకి చొరబడి బీరువాలోని నగదు, నగలను దోచుకొని పరారయ్యారు.

దొంగిలించిన సొత్తును నిజామాబాద్‌కు చెందిన కన్నాపురం నరేందర్ అనే వ్యక్తికి విక్రయించి నగదు పంచుకున్నారని అన్నారు. నిందితుడు సోమేష్ ఇచ్చిన సమాచారం మేరకు, దొంగతనం అని తెలిసి కూడా ఆభరణాలు కొనుగోలు చేసినందుకు నరేందర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.సీపీ సాయి చైతన్య ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో బుధవారం గన్నారం గ్రామ సమీపంలో ఇందల్వాయి పోలీసులు తనిఖీలు చేస్తుండగా నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గంగారం తండా చోరీ ఉదంతం బయటపడింది.సుమారు 25 తులాలకు పైగా బంగారు ఆభరణాలు (కమ్మలు, మాటీలు, ఉంగరాలు, లాకెట్)13 తులాల వెండి పట్టగొలుసులురూ. 8,500 నగదుడియో బైక్, టీవీ, రెండు మొబైల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన డిచ్‌పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్, పీసీలు రాకేశ్, సందీప్, కిషోర్ కుమార్‌లను ఏసీపీ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments