కరీంనగర్ లో నగల షాప్ లో లూటీ కేసు దర్యాప్తు లో కీలక పురోగతి సాధించారు వెస్ట్ బెంగాల్ లో ఇద్దరు కీలక నిందితులు పోలీసులకు చిక్కారు. వీరి ద్వారా మిగతా వారి అచూకీ కోసం గాలిస్తున్నారు.
నగల షాప్ లో లూటీ చేసిన తర్వాత ఈ ముఠా కరీంనగర్ నుంచి ధర్మపురి మీదుగా పారిపోతు వారు చోరీకి కోసం వాడిన సెల్ ఫోన్ ను మద్దునూర్ వద్ద పగులగొట్టి పడేసారు ఆ ఫోన్ మద్దునూర్ వద్ద యువకులకు లభించడం తో పోలీసులకు సెల్ ఫోన్ అప్పగించారు ఆ ఫోన్ లో నిందితుల కీలక ఆధారాలు దొరికినట్లుగా చెప్తున్నారు
వారం రోజులుగా నిందితుల కోసం పశ్చిమ బెంగాల్, బీహర్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఐదు రాష్ట్రాల్లో గాలింపులు జరిపిన ప్రత్యేక బృందాలకు ఇద్దరూ నిందితుల ఆనవాలను గుర్తించి వెస్ట్ బెంగాల్ లో పట్టుకున్నారు వీరితో పాటు పాటు, పీఎంజే నగల దుకాణంలో దోపిడీ చేసిన బంగారం కొనుగోలు చేసిన వ్యాపారినీ సైతం స్థానిక పోలీసులు సహకారం తో అదుపులోకి తీసుకున్నారు
కొంత మేరకు మాత్రమే సొత్తు రికవరీ అయినట్టు సమాచారం. ఈ ముఠా ప్రధాన నిందితుడు చిక్కినప్పటికీ మరో ముగ్గురు దోపిడీ దొంగల కోసం ముమ్మర గాలింపు.జరుగుతుంది సొత్తు కూడా పూర్తీ స్థాయిలో రికవరీ జరిగే ఛాన్స్ ఉంది
