లారీ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ ఘటనా నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు…
గంగాస్థాన్ నుంచి కంటేశ్వర్ నుంచి నిజామాబాద్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనక నుంచి లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
