HomeCRIMEఅక్రమ ఇసుకపై ‘చీత’ పంజా!ఆర్మూర్, మోర్తాడ్‌లో మెరుపు దాడులు.. రెండు భారీ లారీలు సీజ్

అక్రమ ఇసుకపై ‘చీత’ పంజా!ఆర్మూర్, మోర్తాడ్‌లో మెరుపు దాడులు.. రెండు భారీ లారీలు సీజ్

జిల్లాలో అక్రమ ఇసుక రవాణాదారుల గుండెల్లో ‘చీత ఫోర్స్’ వణుకు పుట్టిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

మంగళవారం ఆర్మూర్, మోర్తాడ్ పరిధిలో నిర్వహించిన మెరుపు దాడుల్లో రెండు భారీ 14 టైర్ల లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.జిల్లాలో అక్రమ మైనింగ్‌ను పూర్తిగా తుడిచిపెట్టాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇచ్చిన ఆదేశాలతో పోలీస్ యంత్రాంగం నిఘాను ముమ్మరం చేసింది.

ఏసీపీ (ఇన్‌చార్జ్) మస్తాన్ అలీ పర్యవేక్షణలో చీత ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి.రహస్య సమాచారం అందుకున్న చీత ఫోర్స్ సిబ్బంది, ఆర్మూర్ మరియు మోర్తాడ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వ్యూహాత్మకంగా తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు 14 టైర్ల భారీ లారీలను అడ్డుకున్నారు.తనిఖీ చేసిన సమయంలో వాహన డ్రైవర్ల వద్ద కనీస అనుమతి పత్రాలు గానీ, మైనింగ్ సంబంధిత డాక్యుమెంట్లు గానీ లేకపోవడంతో అవి అక్రమ రవాణా అని నిర్ధారించారు.స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల కోసం సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు అప్పగించారు.

ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? ఇసుక ఎక్కడి నుండి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి ఇవే ప్రధాన కారణం.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటా మనీ హెచ్చరించారు. కేవలం పగలు మాత్రమే కాకుండా, రాత్రి సమయాల్లోనూ ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు హెచ్చరించారు.

అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మీ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు లేదా రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments