ఐపిఎస్ భార్య ఉదంతం ఇంకా మరవక ముందే నేపాలీ గ్యాంగ్ హైదారాబాద్ మరో లూటీ కి పాల్పడ్డారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పని మనుషులు గా చేరిన ఇంట్లోనే లూటీ కి పాల్పడ్డారు . గల్ఫ్ ఎంక్లేవ్లో నివాసం ఉంటున్న ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మీ ఇంట్లో కొంతకాలం క్రితం పని మనుషులుగా చేరింది ఓ నేపాలి జంట.
దంపతుల ఇంట్లో 13 రోజుల క్రితం పనిలో చేరిన ఇద్దరు నేపాలీలు, మరో ఐదుగురు సహచరులతో కలిఈ దొంగతనం చేసినట్లు తెలుస్తుంది.ఓ మహిళ ను తమ బంధువుగాపరిచయం చేసారు దీనితో ఆ దంపతులు ఇంట్లోకి రానిచ్చారు.సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలను ఇంట్లో చేసుకుంటామని అడగడటంతో అంగీకరించారు ప్రొఫెసర్. రాత్రి బర్త్డే వేడుకల పేరుతో ఇంట్లోకి మరో ముగ్గురు వచ్చారు…
అనంతరం బర్తడే కోసం కేక్ తెప్పించి ప్రొఫెసర్ దంపతులే దగ్గరుండి మరీ కట్ చేయించారు వేడుకలు ముగిసిన తర్వాత ముఠా. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేసి… దంపతులను బెదిరించి చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు.
ఈ క్రమంలో మీకు కావాల్సింది తీసుకెళ్లండి, మమ్మల్ని చంపకండి అంటూ వేడుకున్నారు బాధితులు.దీంతో ఇంట్లో నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు బాధితులకు మత్తు మందు ఇచ్చి,రని సమాచారం సుమారు 60 తులాల బంగారం, రూ. 30 వేల నగదును దోచుకెళ్లినట్లు సమాచారం.
ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ముఠా ఇంటి డోర్ తెరిచే ఉంచి వెళ్లడంతో ఆ దంపతులు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు పరుగున వచ్చారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
