నిజామాబాద్ ఉత్తర మండలం పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పాత సామాగ్రి (స్క్రాప్) విక్రయానికి రెవెన్యూ అధికారులు బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
ఈ మేరకు నిజామాబాద్ ఉత్తర మండల ఇన్చార్జ్ తహశీల్దార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.కళాశాలలో నిరుపయోగంగా ఉన్న చెక్క మరియు ఇనుముతో కూడిన డ్యూయల్ డెస్కులు, టేబుళ్లు, కుర్చీలు, స్టూల్స్ మరియు డ్రాయింగ్ బోర్డులను ఈ వేలంలో ఉంచనున్నారు.
ఆసక్తి గల వ్యాపారులు, పౌరులు మే 14వ తేదీ (గురువారం) ఉదయం 11:00 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో జరిగే వేలంపాటలో పాల్గొనవచ్చు. ఈ వస్తువులను ‘ఉన్నది ఉన్నట్లుగా’ ప్రాతిపదికన విక్రయిస్తారు.వేలంలో గరిష్ట ధర పలికిన వారు నిబంధనల మేరకు సొమ్మును వెంటనే చెల్లించాల్సి ఉంటుంది.
ఖరారైన వస్తువులను నిర్ణీత గడువులోగా సొంత ఖర్చులతో తరలించుకుపోవాలి.ఎటువంటి కారణం చూపకుండా వేలం పాటను రద్దు చేసే లేదా తిరస్కరించే అధికారం తహశీల్దార్‌కు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వేలం ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార పౌరసంబంధాల శాఖ ను అధికారులు కోరారు.
