బంగారం ధర మరోసారి అమాంతం పెరిగాయ్ నిన్నటిదాకా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి ఫై సుంకాన్ని 15 శాతానికి పెంచింది. దీంతో.. బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముపై 13 వందల 91 రూపాయలు పెరిగింది.
అంటే తులం బంగారం మీద ఏకంగా 13 వేల 910 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముపై 12 వందల 75 రూపాయలు పెరిగింది. 10 గ్రాములపై 12 వేల 750 రూపాయలు పెరిగింది.బుధవారం ఒక్కరోజే బంగారం ధర దాదాపు 14 వేలు పెరగడంతో కొనుగోలుదారులు విస్తుపోయిన పరిస్థితి.
భారత ప్రభుత్వం బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ప్లాటినం దిగుమతులపై 6.4 శాతం నుండి 15.4 శాతానికి భారీగా పెంచింది.
ఈ పెరిగిన సుంకాలు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.దీనితో బంగారం ధరలు భారీగా పెరిగాయి.అసలే పెండ్లిల సీజన్ కావడంతో పేద దిగువ మధ్యతరగతి ప్రజానీకం బంగారం కొనడానికే జంకుతున్నారు.
ఇటీవల హైదారాబాద్ వచ్చిన మోడీ విపత్కర పరిస్థితుల దృశ్యా బంగారం కొనుగోళ్లు చేయొద్దని ప్రజలను కోరారు. ఆయన వెళ్లిన మూడో రోజే బంగారం దిగుమతి మీద ఆంక్షలు విధించడంతో బంగారం ధర భారీగా పెరిగి నిజంగానే సామాన్య ప్రజానీకం కొనుగోలు చెయ్యలేని రేంజ్ లో ధర పెరుగుతుంది
