కామారెడ్డి మండలం లింగం పేట్ మండలంలోని మోతే గ్రామంలో గురువారం ఒక యువకుడు నాటు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు గ్రామానికి చెందిన తిలిపితీయా ఇంద్రజిత్ సింగ్ (28) గురువారం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు పంపివేసి గదిలోకి వెళ్లాడు.
తన వద్ద ఉన్న నాటు తుపాకీతో చాతిపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఇంద్రజిత్ సింగ్ భార్య, తీవ్ర మనస్తాపంతో గ్రామ సమీపంలోని కుడి కుంటలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుడు కాల్చుకున్న నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకునీ దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.
