HomeTelanganaNizamabadఘనంగా డాక్టర్‌ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు.. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం...మాదిగ జేఏసీ...

ఘనంగా డాక్టర్‌ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు.. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం…మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్‌ మాదిగ

తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత, రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలను గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్‌ అండ్ బీ అతిథి గృహంలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ కేక్ కట్ చేసి, పిడమర్తి రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పిడమర్తి రవి పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.

విద్యార్థి దశ నుంచే అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి, మలిదశ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆయన ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా నాయకులు పెళ్లి విజయ్ మాదిగ, అరుణ్, అన్న బాహుసాటే జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్, మేనత్కర్ శంకర్, గణేష్ జెట్టే తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments