HomeLaw and Orderప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డీఆర్ఓ గీత, డీఆర్డీఓ సాయన్న, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు

కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు.

గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజా పాలన సభలను విజయవంతంగా నిర్వహించామని, అదే స్పూర్తితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిగేలా పరస్పర సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments