HomeCRIMEచాక్లెట్ ఆశచూపి అఘాయిత్య యత్నం...

చాక్లెట్ ఆశచూపి అఘాయిత్య యత్నం…

.

ఒక చిన్నారిపై చాక్లెట్ ఆశచూపి అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘాతుకం జరిగింది. వివరాల్లోకి వెళితే..నగర పరిధిలోని సదరు ప్రాంతానికి చెందిన ఒక చిన్న బాలిక ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి తిరిగి వస్తోంది.

ఈ క్రమంలో అసద్ బాబా నగర్‌కు చెందిన ఒక వ్యక్తి బాలికను గమనించి, ఆమెకు చాక్లెట్ ఇస్తానని నమ్మబలికాడు. ఆ చిన్నారిని బలవంతంగా పక్కకు లాక్కెళ్లి, ఆమె పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిందితుడి బారి నుంచి బాలిక..

ఏడుస్తూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది.కుమార్తె చెప్పిన మాటలు విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆరో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. చిన్నారిపై జరిగిన అకృత్యంపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిందితుడిపై తక్షణమే కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments