నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదుగురు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన సిబ్బంది సోమవారం జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,నీ మర్యాదపూర్వకంగా కలుసుకోగా, సీపీ వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు దక్కడంపై సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఎండి. ఖలీద్ (బోధన్ పిఎస్), డి. గౌరీ శంకర్ (టౌన్ 6 పిఎస్, నిజామాబాద్), బి. శివ కుమార్ (సి.సి.ఆర్.బి, నిజామాబాద్), బి. దూప్ సింగ్ (నందిపేట్ పిఎస్), శ్రీనివాస్ (రైల్వే సికింద్రాబాద్) కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది.
