మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయబోమని, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అని సవాల్ చేశారు.
ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచెందుకే రైతు డిస్కం అని సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కంకు కనెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశామని రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.
