మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యాన్ని చీత ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.మాక్లూర్ మండలంలోని పలు ప్రాంతాల నుండి రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తున్నారనే సమాచారం అందడంతో, చిత్తా టాస్క్ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది.
పక్కా సమాచారంతో చేపట్టిన ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు నిరంతరం నిఘా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు.
