పెండింగ్ జీతాలు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సచివాలయం సిబ్బంది బుధవారం ఆందోళనకు దిగారు గత మూడు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ హౌస్ కీపింగ్ సిబ్బంది బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన సెక్రటేరియట్ భవనంలోనే తమకు ఈ పరిస్థితి ఎదురుకావడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించడం, ఇండ్ల అద్దెలు కట్టడం కష్టంగా మారిందని, అప్పులు తెచ్చుకుని బతకాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.త్వరలో జీతాలు అందేలా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు
