HomeCRIMEఅదనపు ఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు..

అదనపు ఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి గా ఉన్న అడిషనల్ ఎస్పీ, భుజంగరావు నివాసాలు, బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం ఉదయం నుంచి ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాదులోని వనస్థలిపురం ప్రశాంత్‌ నగర్ తో పాటు సూర్యాపేట.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. భుజంగరావు గతంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో ఏసీపీగా, అనంతరం అడిషనల్ ఎస్పీ గా పనిచేశారు.

ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై అక్రమాస్తుల ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

సోదాల్లో భాగంగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, ఆర్థిక రికార్డులు, పెట్టుబడులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. భుజంగరావు కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments