HomeCRIMEచెరువులో పడి వ్యక్తి మృతి..

చెరువులో పడి వ్యక్తి మృతి..

న్యాల్కల్ గ్రామ శివారులోని చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటన మోపాల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..న్యాల్కల్ గ్రామానికి చెందిన కర్రెళ్ల చిన్నశంకర్ (60) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం సుమారు 8 గంటల సమయంలో తన గొర్రెలను చూసి వస్తానని చెప్పి చిన్నశంకర్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రాత్రైనా ఆయన తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు.

గురువారం మధ్యాహ్నం న్యాల్కల్ గ్రామ చెరువు కట్టపై చిన్నశంకర్‌కు చెందిన దుస్తులు, చెప్పులు కనిపించాయి. వెంటనే అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు చెరువులో పరిశీలించగా, మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది.

సమాచారం అందుకున్న వెంటనే ముప్కాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments