HomeCRIMEడిచ్‌పల్లిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

డిచ్‌పల్లిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన డిచ్‌పల్లి మండల పరిధిలోని నాగపూర్ గేట్ చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జక్రాన్‌పల్లి నుంచి బుల్లెట్ బైక్‌పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీకొట్టింది.

ఈ ధాటికి బైక్‌పై ఉన్న యువకులు రోడ్డుపై పడిపోగా, అదే సమయంలో అటుగా నాగపూర్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో బైక్ నుజ్జునుజ్జు కాగా, యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే డిచ్‌పల్లి సీఐ వినోద్, ఎస్సై షరీఫ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments