పోలీసు శాఖలో హోమ్ గార్డ్ హోదాలో సుదీర్ఘకాలం పనిచేస్తూ, ఎటువంటి రిమార్కులు లేకుండా, నిష్కళంక సేవలందించడం ఎంతో అభినందనీయమని ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
హోమ్ గార్డ్ అంకమ్ చక్రధర్ పదవీ విరమణ చేసిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సుదీర్ఘకాలం పాటు విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతను ప్రదర్శించడం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు.
ఎలాంటి మచ్చ లేని సేవల తర్వాత ఉద్యోగ విరమణ పొందడం ఒక గొప్ప విషయమని పేర్కొంటూ, చక్రధర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
