అక్రిడేషన్ పొందిన తెలంగాణ లో జర్నలిస్టులకు వెంటనే ఆర్టీసీ బసు పాస్ లు జారీ చెయ్యాలని సమాచార కమిషనర్ ముకుంద్ రెడ్డి ఆర్టీసీ యం డి కి లేఖ రాశారు.బసు పాస్ లు కూడా 2026-2028 సంవత్సరాలకుచెల్లు బాటు అయ్యేలా ఇవ్వాలని కోరారు.
కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో అర్హులైన రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు రాయితీ బస్ పాస్‍లు జారీ చేయాలని ఆర్టీసీని కోరారు . ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కొత్తగా అక్రిడిటేషన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ కాలానికి అనుగుణంగా 2026-2028 వ్యాలిటీడితో బస్‍పాస్‍లు ఇవ్వాలని లేఖ కోరారు.
ప్రస్తుత బస్ పాస్‌ల గడువు ఈ నెల16తో ముగియనున్న నేపథ్యంలో 17 నుండి 30.04.2028 వరకు వ్యాలిటీడీతో ఆన్ లైన్‍లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా కొత్త అక్రిడిటేషన్లపై సైతం ముకుంద రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశామని మిగిలిన కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
