కామారెడ్డి పట్టణంలో షాపింగ్‌కు వెళ్లిన తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యాదారం అలియాస్ శ్యామల (31), ఆమె కూతుళ్లు బిందు (17), దివిజ (8), కొడుకు శివ (13) బుధవారం మధ్యాహ్నం కామారెడ్డి పట్టణానికి షాపింగ్ నిమిత్తం వచ్చారు.షాపింగ్ పూర్తయ్యాక శ్యామల తన సోదరుని ఇంటికి వెళ్లి భోజనం చేసింది. సాయంత్రం ఇంటికి వెళ్తున్నామని చెప్పి ఆటో ఎక్కి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటల వరకు బస్సుకు వస్తామని చెప్పినా ఇంటికి చేరుకోలేదు.ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన భర్త భాను ప్రకాష్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఆచూకీ కోసం గాలిస్తున్నాru.
