బుధవారం షాపింగ్ కోసమని వచ్చి, ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన ఉదంతం సుఖంతం అయింది వారి ఆచూకీ ని పోలీసులు కనిపెట్టారు రాజంపేట్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యాడారం శ్యామల షాపింగ్ కు వచ్చి మిస్ అయింది
భర్త భానుప్రకాశ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, సాంకేతిక పరిజ్ఞానం (కాల్ డేటా) ఆధారంగా శ్యామల, ఆమె పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టారు.క్షేమంగా గుర్తింపు (శుక్రవారం) వారిని సురక్షితంగా గుర్తించి స్టేషన్కు పిలిపించారు. ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నారని సీఐ తెలిపారు.
కేసు నమోదు చేసిన పోలీసులు, వారు వెళ్ళడానికి గల కారణాలపై తదుపరి విచారణ జరుపుతున్నారు. కేవలం ఒకే రోజులోనే కేసును కొలిక్కి తెచ్చారు
