HomePOLITICAL NEWSహోంగార్డుల కుటుంబాలకు రూ.38 లక్షల బీమా చెక్కుల అందజేత

హోంగార్డుల కుటుంబాలకు రూ.38 లక్షల బీమా చెక్కుల అందజేత

విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.38 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్,అందజేశారు.

బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు అందించారు.హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులు సయ్యద్‌ హుస్సేన్, సింహగిరి ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు.

సయ్యద్‌ హుస్సేన్ నీటిలో మునిగి చనిపోగా.. సింహగిరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డుల వేతన ఖాతాలకు ప్రమాద బీమా కవరేజీ ఉండటంతో.. యాక్సిస్‌ బ్యాంక్‌ వారికి ప్రమాద బీమాను మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో బ్యాంక్, పోలీస్ అధికారులతో కలిసి రూ.38 లక్షల చొప్పున చెక్కులను సయ్యద్‌ హుస్సేన్ భార్య రేష్మా బేగం, సింహగిరి భార్య భవానీకి సీపీ రీ వీసీ సజ్జనర్, గారు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments