నగరంలోని ఆర్యనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.75 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు తదుపరి చట్టపరమైన చర్యల కోసం నాలుగో టౌన్ పోలీసులకు అప్పగించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
l
