HomeEditorial Specialఆమ్మో అమావాస్య..! రేపే మోగనున్న బడిగంట స్కూల్‌కు పంపేందుకు వెనుకాడుతున్న తల్లిదండ్రులు..

ఆమ్మో అమావాస్య..! రేపే మోగనున్న బడిగంట స్కూల్‌కు పంపేందుకు వెనుకాడుతున్న తల్లిదండ్రులు..

ఆదివారం తో వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.తీవ్రమైన ఎండల కారణంగా వారం రోజుల పాటు సెలవులను పొడిగించిన ప్రభుత్వం సోమవారం విద్యాసంస్థల తెరవాలని ఆదేశించింది కానీ సోమవారం అమావాస్య ఘడియలు వస్తుండడం తో తమ పిల్లను పాఠశాలలకు పంపడానికి వెనుకాడుతున్నారు .

అమావాస్య రోజున ఏ పని తలపెట్టని తాము తొలి రోజే స్కూల్స్ ఎలా పంపుతామని తల్లిదండ్రులు అంటున్నారు. బుధువారం లేదా గురువారం అయితే మంచి రోజు కాబట్టి అదే రోజు పిల్లను స్కూల్స్ పంపుతామని చెపుతున్నారు.

అమావాస్య తిథి నాడు పిల్లలను పాఠశాలకు పంపడం మంచిది కాదనే అభిప్రాయంతో పలువురు తల్లిదండ్రులు తొలిరోజు స్కూల్‌కు పంపేందుకు ససేమిరా అంటున్నారు ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15న పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ, అమావాస్య సెంటిమెంట్ కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బుధవారం నుంచి మాత్రమే పంపించాలని భావిస్తున్నారు.అమావాస్య నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సైతం విద్యార్థుల హాజరు తక్కువగా ఉండే అవకాశం ఉందని భావించి నేరుగా జూన్ 17 నుంచే తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నాయి అమావాస్య ప్రభావం ఈసారి విద్యారంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

గ్రామీణ ప్రాంతాలకు సంగతి ఎలా ఉన్న పట్టణ నగర ప్రాంతాల్లోనూ పేరెంట్స్ సైతం ఇదే మూఢ నమ్మకాలను పాలో అవుతుండడం ఫై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలలు కలిపి సుమారు 1,756 ఉండగా పాఠశాలలు ఉన్నాయి.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే అమావాస్య సెంటిమెంట్ నేపథ్యంలో తొలి రోజు విద్యార్థుల హాజరు ఎంత మేర ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

అమావాస్య, పౌర్ణమి వంటి ఖగోళ సంఘటనలను శుభాశుభాలతో ముడిపెట్టడం శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమని విద్యావేత్తలు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు పేర్కొంటున్నారు. చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించని రోజునే అమావాస్యగా పిలుస్తారని, దానికీ పిల్లల విద్యాభ్యాసానికీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.

తమ పిల్లను ప్రయోజకులుగా తీర్చి దిద్దాలనుకునే వారు ఇలాంటి మూఢ నమ్మకాల కు దూరంగా పెంచాలని వారు కోరుతున్నారు . నిజానికి అమావాస్య పౌర్ణమి కంటే వెయ్యి రేటు అనుకూలమైనది. విద్యార్థులకు అమావాస్య పౌర్ణమి తిది బాలాలు ముఖ్యం కాదు.

భగవంతుని ఆశీర్వాదంతో పాటు చదవాలి అనే సంకల్ప బలం, మరియూ చదివించాలి అని తల్లిదండ్రుల సంకల్ప బలం ముఖ్యమైనది.

పాఠశాల కు వెళ్లే మొదటి రోజున గ్రామం లోని దేవాలయం నకు వెళ్లి ఇష్ట దైవానికి ప్రార్థన లు నిర్వాహించిన తర్వాత పాఠశాల కు వెళ్లడం ఉత్తమని శాస్రం తెల్సిన పండితులు చెప్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments