డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటు తో అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ ఓబులేశు.. తన సెక్టార్ పరిధిలో టిఫిన్ చేయడానికి హోటల్‌కు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు.
గమనించిన స్థానికులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. హోటల్ వద్దే మృతి చెందటం తీవ్ర విషాదాన్ని నింపింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు
