HomeTelanganaNizamabadరోగులకు అన్నదానం చేసిన టీఎన్జీవో నేత ముజీబ్

రోగులకు అన్నదానం చేసిన టీఎన్జీవో నేత ముజీబ్

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. ఎం. హుస్సైనీ (ముజీబ్) ఆసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి వెంట ఉన్న సహాయకులకు డాక్టర్ ముజీబ్ తన స్వహస్తాలతో ఆహారాన్ని పంపిణీ చేశారు.

తన తల్లిదండ్రులైన శ్రీ ఆసదుద్దీన్ మరియు శ్రీమతి అన్వరున్నీసా స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా, డాక్టర్ ముజీబ్ ప్రతి వారం ఆసుపత్రిలో రోగులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స కోసం దూర ప్రాంతాల నుండి వచ్చి, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ అన్నదానం ఎంతో ఆసరాగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓ.ఎస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్ (అసోసియేట్ ప్రెసిడెంట్), శ్రీ వైదిక్ శేస్త్ర (పబ్లిసిటీ సెక్రటరీ), శ్రీ ముకీమ్ ఖురేషి (టి.ఎన్.జి.ఓ.ఎస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా ఈ.సి. సభ్యులు), శ్రీ శివ కుమార్ (ప్రెసిడెంట్, ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆసుపత్రి యూనిట్), శ్రీ చంద్రశేఖర్ (సెక్రటరీ, ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆసుపత్రి యూనిట్), శ్రీ మహ్మద్ వాహిద్, శ్రీ మహ్మద్ ముస్తఫా మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ, “నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులకు కడుపునిండా భోజనం పెట్టడం కంటే గొప్ప తృప్తి మరొకటి లేదు.

సమాజం కోసం కొంతైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాను. యూనియన్ నాయకులు, సభ్యులందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు.అంతేకాకుండా, ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, ఇతర సౌకర్యాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.

యూనియన్ పరంగా రోగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments