ఈరోజు ఇందూరు నగరంలోని దుబ్బా మేరు సంఘం భవనంలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో “నమో GEN Z యువ సమ్మేళనం” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండ కార్తీక రెడ్డి, దినేష్ పటేల్ కులాచారి మరియు గోపిడి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సతీష్ రెడ్డి సభకు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా బండ కార్తీక రెడ్డి మాట్లాడుతూ, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో యువతకు ఎన్నో అవకాశాలు కల్పించబడినట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ప్రధాన్ మంత్రి ముద్ర యోజన, PM ఇంటర్న్‌షిప్, ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి, స్వయం ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరించాయని పేర్కొన్నారు.
దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం యువత శక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగించుకుంటూ ప్రపంచంలోనే భారత యువతకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
గోపిడి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ, మహిళా యువత సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు మరియు డిజిటల్ రంగాల్లో యువత ముందుకు రావాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న యువతకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు యువజన సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలు మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు పూర్తి గా వివరించారు
ఈ కార్యక్రమం లో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు స్వామి యాదవ్, నారాయణ యాదవ్, బీజేవైఎం నాయకులు వీపుల్ రావు, వినోద్ రెడ్డి, రాజ్ గణేష్, రాజశేఖర్, గౌతమ్ బీజేవైఎం నాయకులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
