నిజామాబాద్ నగరంలోఎంతో చారిత్రత్మక నేపథ్యం ఉన్న బాపూజీ వచనాలయం ఆస్తుల నిర్వహణ లో అప్రతిష్ట ను మూట గట్టుకుంటుంది అద్దె వివాదాలు ఆ సంస్థ ను అపఖ్యాతి పాలు చేస్తున్నాయి.
ఆదాయం సమకూర్చే మడిగెల కేటాయింపు వ్యవహారంలో పాలక మండలి అనుసరిస్తున్న ఓటెద్దు వ్యవహారాలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి దాదాపు ముప్పైయేళ్లుగా మడిగెలో అద్దె కు ఉన్న ఓ వృద్ధుడి పేరును ఉన్న మడిగెను దొడ్డి దారిలో అదే మడిగెలో అద్దెకున్న వ్యక్తి కి కట్టబెట్టడం వివాదంగా మారింది సదురు బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
కానీ సివిల్ వివాదం అంటూ చేతులు ఎత్తేయడంతో మడిగె తాళం ను ఆ వృద్ధుడే వెళ్లి పగల గెట్టడం కలకలం రేపింది వాటి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. గత 60 సంవత్సరాల క్రితం సబ్బాని వెంకటపతి రాజు అనే వ్యక్తి ఈ మడిగెను లీజుకు తీసుకున్నారు.
అప్పట్లోనే ఆయన రూ 10,వేలు డిపాజిట్ చేసాడు , అప్పటి నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా కిరాయి చెల్లిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే..?వెంకటపతి రాజుకు వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో.. తనకు తెలిసిన ఓ వ్యక్తికి జీవనాధారం కోసం, తన సొంత ఖర్చులతో అక్కడ షాప్ పెట్టించి, నిర్వహించుకోమని ఇచ్చారు.
కేవలం కిరాయి మాత్రమే కట్టాలని స్పష్టం చేశారు.అయితే, గత కొన్ని నెలలుగాసదురు వ్యక్తి నెలవారీ కిరాయి కట్టడం మానేశాడు. , అదే కిరాయి దారుడు ఇప్పుడు ఆ మడిగె తనదేనంటూ దబాయించడం మొదలుపెట్టాడు.
బాపూజీ వచనాలయం సెక్రెటరీకి రూ 30వేలు ఇచ్చి, ఈ మడిగెను తానే కొనుగోలు చేశానని దబాయించి దుకాణానికి తాళాలు వేసి వెళ్ళాడు ఈ విషయమై బాధితుడు వెంకటపతి రాజు తన భార్యతో కలిసి వచనాలయం సెక్రెటరీ ను వివరణ అడగగా.. “మీ ఇష్టం వచ్చినట్లు, ఎక్కడైనా చెప్పుకోండి.. మేము ఆ మడిగె అతనికే ఇచ్చాం” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం తో ఆ వృద్ధ దంపతులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు .
చివరికి ఒకటో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు కానీ బాపూజీ పాలక మండలి లో అధికార పార్టీ నేతలుండడంతో పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేసారు ..
బాధితుల హెచ్చరికనెలల తరబడి కిరాయి ఇవ్వకుండా, అక్రమంగా తాళాలు వేసి వెళ్ళిపోవడంతో విసిగిపోయిన వెంకటపతి రాజు దంపతులు తమ మడిగె కు ఉన్న తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్తామని పోలీసుల సమక్షంలో స్పష్టం చేశారు. నేరుగా వెళ్లి ఆ మడిగె తాళాలు పగల గొట్టి తమ స్వాధీనం లో తెచ్చు కోవడం కలకలం రేపింది.
