పోక్సో కేసు నిందితుడు గా ఉన్న బండి భగీరథ్‌కు మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరుచేసింది.తన మైనర్ కూతరు ను కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడి భగీరథ్ లైంగిక వేధింపులకు గురిచేసాడంటూ ఓ మహిళా పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో మే 8 న పిర్యాదు చేసింది.
కేసు నమోదు కావడంతో భగిరత్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు అతని కోసం ప్రత్యేక బృందాలు గాలించాయి కేంద్ర హోం సహాయ మంత్రి ఇల్లు ఆఫీస్ ల్లోనూ సోదాలు చేసారు చివరికి మే 16 న ఆయన పోలీసులకు లొంగిపోయాడు.
బండి భగీరథ్ వేసిన బెయిల్ పిటిషన్‌ను ప్రభుత్వ తరపు లాయర్లు గట్టిగా వ్యతిరేకించక పోవడంతో మల్కాజ్‌గిరి కోర్టు అతనికి షరతుల తో కూడిన బెయిల్ మంజూరు చేసింది
