HomeCRIMEఇద్దరు కొడుకుల‌కు కడతేర్చి ఆత్మ హత్య యత్నించిన తల్లి!ఖమ్మం జిల్లాలో దారుణ ఘ‌ట‌న‌

ఇద్దరు కొడుకుల‌కు కడతేర్చి ఆత్మ హత్య యత్నించిన తల్లి!ఖమ్మం జిల్లాలో దారుణ ఘ‌ట‌న‌

భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న వివాదం చివరకు ఇద్దరు కొడుకులను పొట్టనబెట్టుకునేలా చేసింది. ఫాదర్స్ డే ఆ తండ్రికి పుట్టెడు దుఃఖం మిగిల్చింది

ఖమ్మం నుంచి సొంత ఊరికి వెళ్లే విషయంలో బార్యాభర్తలకు గొడవ మొదలైంది ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు గ్రామానికి చెందిన బొబ్బల లింగరాజు, స్వాతి దంపతులు గత కొన్ని నెలలుగా కుటుంబ అవసరాల నిమిత్తం ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు.

లింగరాజు అక్కడే స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ షాపులో వర్కర్ గా పని చేస్తూ న్నాడు తన సొంత ఊరైన గుర్రాలపాడు వెళ్లి అక్కడ ఏదైనా పని చేసుకుని బ‌తుకుదామని భార్యకు నచ్చజెప్పాడు. కానీ భార్య స్వాతి మాత్రం అందుకు నిరాకరించింది. మ‌నం ఖమ్మంలోనే ఉండాలని పట్టుబట్టింది.

ఈ విషయమై గత రెండు రోజులుగా భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరుగుతోంది.ఈ నేపథ్యంలో నే ఇద్దరు కోడుకులతో కలిసి ఆత్మ హత్య చేసుకోవడానికి సిద్ధం అయింది శ‌నివారం సాయంత్రం ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లలో ఎలకల మందు కలిపి తినిపించింది.

ఆ తర్వాత ఏమీ తెలియనట్లు భర్తకు ఫోన్ చేసి.. పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని, త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. కంగారుగా ఇంటికి వచ్చిన లింగరాజు.. స్థానిక మెడికల్ షాప్‌లో సిరప్ తీసుకువచ్చి పిల్లలకు తాపించి పడుకోబెట్టాడు.

అయితే విషప్రభావం ఎక్కువ కావడంతో పెద్ద కుమారుడు వేదక్ కుమార్ నిద్రలోనే కన్నుమూశాడు. చిన్న కుమారుడికి తీవ్రంగా విరోచనాలు కావడంతో వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

కానీ అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో చిన్న కుమారుడు తనీష్ కూడా మరణించాడు. ఫాదర్స్ డే నాడే ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో తండ్రికి తీరని విషాదాన్ని మిగిలించింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments