HomeCRIMEఅంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్‌- నిందితులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు- వీరి...

అంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్‌- నిందితులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు- వీరి వద్ద నుండి 1.93కోట్ల విలువచేసే 387.128 కిలోలు గంజాయి స్వాధీనం.- వివరాలు వెల్లడించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్‌

ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న అంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును కామారెడ్డి దేవునిపల్లి పోలీసులు రట్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్‌ చంద్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

జిల్లాలోని క్యాసంపల్లి జాతీయ రహదారి మీదుగా పనసపండ్ల మాటున గంజాయి రవాణా చేస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యులు ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

వీరి వద్ద నుంచి రూ.1.93కోట్ల విలువచేసే 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కరిముల్ల, సుభాష్‌, రహీమ్‌గా గుర్తించారు. వీరి వద్ద నుండి అశోక లేలాండ్‌ వాహనం, 2 ఫోన్‌లు, 500 నగదు, స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను రిమాండ్‌కు తరలించారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు కామారెడ్డి ఎస్పీ రాజేష్‌ చంద్‌ రివార్డులు ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments