రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన నిర్మాణాలు గండిపేట చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు సోమవారం వాటిని కూల్చివేశారు.
గండిపేట మండలం మంచిరేవుల వీరభద్రస్వామి ఆలయం సమీపంలోని సర్వే నంబర్లు 326, 327, 328, 329లో బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌తో పాటు పూజారి నాగేంద్రప్ప, మరో వ్యక్తికి కొంత భూమి ఉంది.
ఈ భూమిని లీజుకు ఇవ్వగా, అందులో సుమారు ఎకరం విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టి ఓ పాఠశాలకు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. పాఠశాల భవనం మొత్తం గండిపేట చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉండటంతో నిర్మాణాలను తొలగించాలని రెవెన్యూ అధికారులు నోటిస్ ఇచ్చారు .
ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వర్‌తో పాటు ఇతరులు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం వారికి నాలుగు రోజుల గడువు ఇచ్చినట్లు తెలిసింది.
ఇటీవల రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేయడానికి ప్రయత్నించగా, వాటిని స్వీకరించేందుకు నిరాకరించినట్లు అధికారులు తెలిపారు.దీనితో జెసిబి తెచ్చి బఫర్ జోన్ లో నిర్మాణాలను తొలగించారు
