నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) నూతన కార్యవర్గం బాధ్యతలను చేపట్టింది.
ఈ మేరకు ఆదివారం కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాత కార్యవర్గం నుంచి బాధ్యతలను కొత్త వారు స్వీకరించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ ప్రణీత్ రెడ్డి ఎన్నికవగా, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ ప్రణయ్, డాక్టర్ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.
మాజీ అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ నూతన కార్యవర్గ సభ్యులకు బాధ్యతలను అప్పగించి, వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్ల సంక్షేమం, విద్యా కార్యక్రమాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని తెలిపారు.
విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, ఆసుపత్రి పరిపాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు.
జూనియర్ డాక్టర్ల ప్రయోజనాలను కాపాడటంలో నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేస్తుందని మాజీ అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు,జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
