HomeCRIMEపోలీస్ ప్రజావాణి'లో ఫిర్యాదుల వెల్లువ..జిల్లాలో ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించే...

పోలీస్ ప్రజావాణి’లో ఫిర్యాదుల వెల్లువ..జిల్లాలో ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ మేరకు మొత్తం 17 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను స్వయంగా పరిశీలించిన ఆయన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్.ఐలు, సీఐలకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

సమస్యల తీవ్రతను బట్టి, చట్టపరిధిలో ఉంటూ తక్షణమే పరిష్కరించాలని సూచించారు.ప్రజలు పోలీసు సేవలను వినియోగించుకోవడంలో ఎటువంటి మధ్యవర్తులు, పైరవీల అవసరం లేదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు.

ప్రజలు నిర్భయంగా పోలీసు కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చు. ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిష్కరిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత దగ్గర చేయడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments