ర్ఇందూరు నగరంలోని 45వ డివిజన్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్థానిక బిజెపి కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆమె ‘స్పెషల్ డ్రైవ్’ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులచే తొలగించారు. అలాగే, డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన పూడికను తీయించి, నీరు సాఫీగా సాగిపోయేలా చర్యలు తీసుకున్నారు
. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నాజీర్ స్వయంగా డివిజన్‌కు విచ్చేశారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, స్థానిక పరిస్థితులపై కార్పొరేటర్‌తో చర్చించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నామని, డివిజన్‌లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
ప్రజలందరూ చెత్తను రోడ్లపై వేయకుండా, తడి-పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
