రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని న్యూ శ్రీ చైతన్య కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాల ముందు ధర్నా చేపట్టారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఆదిభట్ల సీఐ ఆందోళన చేస్తున్న చేయి చేసుకున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు. అమ్మాయిలపై పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా మండిపడ్డారు.
“విద్యార్థినులపై చేయి ఎలా చేసుకుంటారు?” అంటూ చుట్టూ ఉన్నవారు సదరు అధికారిని నిలదీశారు.రోడ్డు మీద ఆందోళన చేస్తుండడం వల్ల ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిందని అందువల్లే వారిని సీఐ నెట్టేశాడు
