HomeTelanganaHyderabadరెండో దఫా మెట్రో లైన్ క్లియర్ ....ఫలించిన రేవంత్ ఎదురు దాడి ..........చొరవ తీసుకున్న కిషన్...

రెండో దఫా మెట్రో లైన్ క్లియర్ ….ఫలించిన రేవంత్ ఎదురు దాడి ……….చొరవ తీసుకున్న కిషన్ రెడ్డి

రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో ఫేజ్‌-2కు ఎట్టకేలకు లైన్ క్రియర్ అయింది. కేంద్రం వైఖరి వల్లే మెట్రో లెట్ అవుతుందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెట్రోపై ఏకాభిప్రాయానికివచ్చాయి మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 అంశాలపై అధ్యయ‌నానికి క‌న్సల్టెంట్ గా యస్ బి ఐ సి ఏ పి యస్ ( SBICAPS) నియమించారు. క‌న్సల్టెంట్ నివేదిక ఆధారంగా భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌ ఉంటుందన్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకై సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మెట్రో రైలు స్వాధీనం, సెకండ్ ఫేజ్ విస్తరణకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. నిన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. నేడు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు.

ఉదయం నుంచి ఆయన నివాసంలోనే హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ, ఐ ఆర్ ఎఫ్ సి రుణం, తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. మెట్రో ఫేజ్ -1 వాల్యుయేషన్, ఫేజ్ -2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన క్యాప్స్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తుందని ఈ సమావేశంలో నిర్ణయించారు. కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని.. సీఎం, కేంద్రమంత్రులు నిర్ణయించారు.

////// నా వంతు పని నేను చేశా …..కిషన్ రెడ్డి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‍తో సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు లేఖలు రాశారని ఈ నేపథ్యంలో గత రెండ్రోజులుగా ఢిల్లీలో ఇద్దరు కేంద్రమంత్రులతో సమావేశాల కోసం చొరవతీసుకున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా, రేవంత్ రెడ్డి, నేను కలిసి నిన్న అశ్వినీ వైష్ణవ్‍తో, ఇవాళ మనోహర్ లాల్ ఖట్టర్‍తో సమావేశం అయ్యామని కేంద్రమంత్రులతో సీఎం సమావేశాలకు సమన్వయం చేశానని చెప్పారు ఈ రెండు సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగినట్లు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేను రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం నావంతు కృషిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి పోస్టు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments