సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద మంగళవారం నిర్వహించిన భారీ నిరసన జరిగింది కాంగ్రెస్ టిజెఎస్ లతో పాటు వామపక్ష పార్టీ లు పాల్గొన్నాయి శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం ఎంపీ మల్లు రవి కు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొ.కోదండరాం గారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించే అవకాశం ఉన్న ఏ చర్యనైనా ప్రజాస్వామ్య శక్తులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయడం సాధ్యం కాదని, కనీసం ఒక సంవత్సరం పాటు ఈ ప్రక్రియను కొనసాగిస్తేనే ఓటర్లకు తగిన అవకాశం లభిస్తుందని అన్నారు.
గతంలో ఎస్ఐఆర్ నిర్వహించిన రాష్ట్రాల్లో తగిన సమయం లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు.తెలంగాణలో కూడా లక్షలాది మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివిధ కారణాలు చూపుతూ పౌరుల ఓటు హక్కును తొలగించే పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని అన్నారు.
